నీ వాహనం
నీ కంట్రోల్లో వున్నంత సేపు నీవు
రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేసినంత సేపు
వాహనంలో వున్నవారంతా అదృష్టవంతులే
వారి ప్రయాణం సుఖవంతమే గమ్యం సురక్షితమే
కాని నీ వాహనం
నీ కంట్రోల్లో వుండనప్పుడే
అతి వేగంగతో అదుపు తప్పేది డివైడర్ నిఢీకొనేది
మృత్యువు ముందుకు దూసుకు వచ్చేది
ఘోర ప్రమాదాలు జరిగేది ప్రాణాలు గాల్లో కలిసేది
నీ శరీరం
నీ కంట్రోల్లో వున్నంత కాలం
నీవు రోజూ వ్యాయామం యోగ
జాగింగ్ వాకింగ్ చేస్తున్నంతకాలం
నీవు ఖచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా వుంటావు
కాని నీ శరీరం
నీ కంట్రోల్లో వుండకపోతే నీవు
ధనకనకవస్తు వాహనాలంటూ పరుగులు పెడితే
విందు పొందు అంటూ పార్టీలలో చిందులు వేస్తే
నీకన్నీ అవస్థలే, అనారోగ్యమే, అప్పులే, ఆవేదనలే
నీ మనసు
నీ కంట్రోల్లో వున్నంత కాలం
మంచితనం మానవత్వంతో నీ హృదయం వికసిస్తే
నీలో ప్రేమ దయ జాలి కరుణ పొంగిపొర్లితే
నీకిక సుఖ సౌఖ్యాలు, శాంతి సౌభాగ్యాలు వరాలే
కాని నీ మనసు
నీ కంట్రోల్లో వుండనినాడు
నీలో అసూయ ద్వేషం అహంకారం
పగా ప్రతీకారం హద్దు మీరిపోయిననాడు
కామ క్రోధ లోభ మోహ, మద మాత్సర్యాలతో
నీ మనసు కలుషితమై పోయిననాడు
నీకన్నీ అవమానాలే, అపనిందలే, అపజయాలే
అందుకే ఏదైనా, ఎప్పుడైనా, ఎందుకైనా
కంట్రోల్ తప్పితేఎవరికైనా కష్టాలే,కన్నీళ్లే,కలవరింతలే



