వెయ్యేళ్ళు వర్ధిల్లడం ఖాయం....
చిరునవ్వు
మీ ముఖాన చిగురిస్తే
శతృవులను సైతం
మీరు ప్రేమతో పలకరిస్తే
శాంతము సమాధానాలు
గులాబీలై మీ ఎదలో గుభాళిస్తే
సహనం సర్దుబాటుగుణాలను
కలలో సైతం మీరు కలవరిస్తే
మంచితనం మానవత్వం
కుంగిపోయిన వారి మీద కుమ్మరిస్తే
వినయం విధేయతలు
విరజాజిపువ్వుల్లా మీలో విరబూస్తే
భయము భక్తి
మీ మనసులో పాలు తేనెలై ప్రవహిస్తే
జాలి కరుణ దయా దాక్షిణ్యాలు
మీ గుండెల్లో పొంగి పొర్లితే
మీరు చరిత్రలో వెయ్యేళ్ళు వర్ధిల్లడం ఖాయం
పొల్లుపోదు కల్లకాదు పోలన్న పలికిన మాట



