Facebook Twitter
ఏమిటీ రాక్షసత్వం ? ఇదెంతకాలం?

మనఆడపిల్లలకు తమకు
నచ్చిన వారితో తిరిగే హక్కు
ప్రక్కవారితో మాట్లాడే హక్కులేదా?
అది వారి జన్మహక్కు కాదా?

మరి ఆడపిల్లలను కిరాతకంగా
హత్య చేసే హక్కు
ప్రేమించిన పాపానికి అమ్మాయిల
ఇష్టాయిష్టాలను శాసించే
హక్కు ఈ ఉన్మాదులకెక్కడిది?

అసలు తప్పెవరిది...? అమ్మాయిలదా?
అమ్మాయిల తల్లిదండ్రులదా?
అబ్బాయిలదా?అబ్బాయిల తల్లిదండ్రులదా?
అబ్బాయిలు కలిసి తిరిగే పోకిరి వెధవలదా?
చట్టాలను కఠినంగా అమలు పరచలేని
అంధులైన అధికారులదా?
అమ్మాయి మనసును...చూపును
మాటను...నడకను...నవ్వును...ప్రవర్తనను
రాకపోకలను...గమనించని కలిసితిరుగుతున్న
స్నేహితులపై నిఘాపెట్టని... 
పొంచివున్న ప్రమాదాలను అంచనా వేయలేని...
అమాయకులైన అమ్మానాన్నలదా?
ఎవరిది ? ఎవరిది ? తప్పెవరిది...???

నక్కినక్కి ప్రక్కనచేరి తియ్యగా మాట్లాడగానే
మనసు పారేసుకొనే...అందాలు ఆరబోసే...
అడగ్గానే అన్నీ ఉచితంగా అర్పించుకొనే...
ఎవ్వరి చక్కెర మాటలు చెవికెక్కక...
నల్లవన్నీ నీళ్ళనీ తెల్లవన్నీ పాలని పూర్తిగా నమ్మే...
పీకలదాకా పిచ్చి ప్రేమలో మునిగితేలే...
ఊబిలో కూరుకుపోయే...ఉక్కిరిబిక్కిరైపోయే...
ఊపిరాడక ఉరేసుకునే...ఊపిరితీసుకునే...
కన్నవాళ్ళ గుండెల్లో గునపాలను గుచ్చే...
కళ్ళను కన్నీటిసముద్రాలుగా మార్చే అమ్మాయిలదా?
అమ్మాయిలకు ఆత్మరక్షణ కవచాలను అందించని అభాగ్యులైన అమ్మాయిల తల్లీదండ్రులదా?
ఎవరిది ? ఎవరిది ? తప్పెవరిది...???

పోకిరిచేష్టల్లో ఆరితేరిన
రాక్షస మనస్తత్వమున్న
రౌడీమూకలతో తిరుగుతూ
డ్రగ్స్ కు అలవాటుపడి...అర్థరాత్రుల్లో
పార్టీలపేరుతో మందుకొట్టే అబ్బాయిలదా?
ఆ మత్తులో ఇంటికొచ్చే పిల్లల విచిత్రమైన
వింత ప్రవర్తనపై నిఘాపెట్టని
పిల్లలకు నైతిక విలువలు నేర్పని
అజ్ఞానులైన అబ్బాయిల తల్లిదండ్రులదా?
ఎవరిది ? ఎవరిది ? తప్పెవరిది...???.

ఆలోచించాలి...
విజ్ఞులు...వివేకవంతులు
కులపెద్దలు...మతపెద్దలు...
సంఘసంస్కర్తలు