ఈ బ్రతుకు బాటలో
ఈ పూల తోటలో...
ఈ వెలుగు వేటలో...
ఈ బ్రతుకు బాటలో...
మనతో ప్రభువు పలికే
ప్రతి మాట జీవజల ఊట
ముత్యాల మూట రక్షణ కోట
మన శరీరానికి
అనుదినం ఆహారం
అత్యవసరం
మన ఆత్మకు సైతం
మనం చదివే వాక్యమే
మనం చేసే ప్రార్థనే
మనం అందించే
అనుదిన ఆత్మీయ ఆహారం
మనం ప్రభువుతో పలికే
ప్రతి వాక్యం
మన అందరికి
ఒక అమృతం
ఒక అద్భుత ఔషధం
అది అపవాదితలపై విసిరే
ఒక శక్తివంతమైన ఆయుధం



