Facebook Twitter
నీ అంతరాత్మ ప్రబోధం ?

నీకున్నది కాని
నీవు కొన్నది కాని
నీది అనుకున్నది కాని 
ఏదీ నీది కాదు 

నిన్ను కన్నవారు కాని 
నీవు కట్టుకున్నవారు కాని 
నీవు కన్నవారు కాని 
ఎవరూ నీవారు కారు
ఎవరూ నీ వెంట రారు

ఔనిదినిజం పచ్చినిజం 
అందుకే మరెందుకు ఎందుకు
నీవు అనుభవించలేని ఆ లక్షలకోట్ల
మీద అంత ఆశ ఎందుకు? 

నీకుదక్కని అంతులేని ఆ స్థిరాస్తులు
ఆర్జించాలని అంత ఆరాటమెందుకు? 
అని అంటుంది కదూ నీ అంతరాత్మ 

అట్టి నీ అంతరాత్మ ప్రబోధం 
నీవు శ్రద్ధగా విన్ననాడు
బుద్ధిగా ఆచరించిననాడు
ఆస్తిని ప్రేమను ఆనందాన్ని
పదిమందికి పంచిననాడు
పరమాత్మ ప్రసాదించు నీకు
ప్రశాంతమైన పచ్చని జీవితాన్ని