Facebook Twitter
ఆమె ?

ఆమె రూపం
దారి చూపే దీపం
ఆమె తీరు
దాహం తీర్చే సెలయేరు
ఆమె మాట
కమ్మని కోయిల పాట
ఆమె నన్నిలా
అల్లుకున్న చల్లని వెన్నెల
ఆమె ఓ కల్పవల్లి
కాదు కాదు
కడుపును మనసును
నిండుగా నింపే కన్నతల్లి