విశిష్టమైన వ్యక్తిత్వం…
గొంతులో ఉన్నమాటను
పెదవులతో పలికింవచ్చు
గుండెలో ఉన్నమాటను
కళ్లతో చిలికించవచ్చు
గుండెలో దూరే మాటలు
మదిలో ముద్రవేయవచ్చు
కళ్లు చెవులు సైతం
వాటికి సహకరించవచ్చు
మన నిజస్వరూపాలు
మననోటి మాట ద్వారా
మన ప్రవర్తన ద్వారా
మన (కు)సంస్కారం
ద్వారా వ్యక్తమౌతాయి
మన వ్యక్తిత్వం ద్వారా
వెలుగులోకి వస్తాయి
నలుగురికి తెలుస్తాయి
విశిష్టమైన వ్యక్తిత్వమున్న
కొందరికి రెండు చేతులెత్తి
నమస్కారం పెట్టాలనిపిస్తుంది
కారణం వారిలోని మంచితనం
విషం చిమ్మే వ్యక్తిత్వమున్న
కొందరి రెండు చెంపలు
పగల గొట్టాలనిపిస్తుంది
కారణం వారిలోని మోసకారితనం



