ఓ నవదంపతులారా!
నా మాట వినండి
ప్రేమ తరిగి తరిగి
బుద్ది చెదిరి చెదిరి
కళ్ళు బెదిరి బెదిరి
కాళ్ళు వణికి వణికి
గుండె పగిలి పగిలి
మనసు నలిగి నలిగి
పెదవులు అదిరి అదిరి
కూరగాయలు కుళ్ళినట్టు
పండిన పండు చెట్టునుండి రాలినట్టు
అనురాగాలు తరిగి తరిగి
అవమానాలు జరిగి జరిగి
అనుమానాలు పెరిగి పెరిగి
అపార్థాలు ముదిరి ముదిరి
పగా ప్రతీకారాలు ఎగిసి ఎగిసి
కాపురంలో కారుచిచ్చు రగిలి రగిలి
వివాదాలు
చిలికి...చిలికి...
గాలివానలౌతాయి
విషాదాన్ని మిగిలిస్తాయి
విడాకులే శరణ్యమౌతాయి...
వివాహబంధాలు విచ్చిన్నమైపోతాయి...
అందుకే ఓ నవదంపతులారా!
తస్మాత్ జాగ్రత్త!!



