Facebook Twitter
ఆ ఇద్దరు? (2)

ఒకరు కరకునేల మీద
మరొకరు పట్టుపరుల మీద

ఒకరు ఆకలికి అలమటిస్తారు
మరొకరు ఎక్కువై కక్కుతారు

కారణం ఒకరు దినసరి కూలి
మరొకరు వ్యాపారి ఆదాయం లక్షల్లో

ఒకరికి పచ్చడి మెతుకులు
మరొకరికి పంచభక్ష్య పరమాన్నాలు

ఒకరు చిరిగిన మురికి బట్టలతో
మరొకరు ఖరీదైన సూటు బూటులతో

ఒకరు లోయల్లో అధఃపాతాళంలో
మరొకరు ఎత్తైన ఎవరెస్టుశిఖరాలపైన

ఒకరు ఊరబావిలో గిరగిరాతిరిగే కప్ప
మరొకరు విమానాల్లో విదేశాల్లో ‌విహారి

ఒకరు నిలువ నీడలేని కడునిరుపేద
మరొకరు రాజు మకుటంలేని మహారాజు

అయ్యో ఓ దైవమా! ఇచ్చిన మేధస్సును
అందిన అవకాశాన్ని...పొందిన సమయాన్ని

అమాయకత్వంతోనో...అజ్ఞానంతోనో
సకాలంలో సద్వినియోగం చేసుకోలేని
వారి అసమర్థతనా ? చేతిగీతనా?
విధివ్రాసిన నుదిటి వ్రాతనా?
ఏమిటి ? ఏమిటి? ఈ మాయ?
ఎక్కడుంది లోపం ? ఇదెవరి శాపం ?