పర్యావరణాన్ని పాతరేస్తే…
నేను నింగిలో మేఘాన్నౌతా
కరిగి వర్షపు చినుకునౌతా
రైతుకు పచ్చని బ్రతుకునౌతా...!
నేనొక శిలనౌతా
నేనొక గుడిమెట్టునౌతా
నేనొక సుందర శిల్పాన్నౌతా
గుడిలో అర్చనలనందుకుంటా...!
నేను గలగల పారె గంగనౌతా
జలజల దూకే జలపాతాన్నౌతా
ఉరుకుల పరుగుల సెలయేరునౌతా...!
నేనొక పచ్చని చెట్టునౌతా చల్లని
నీడనిస్తా మీ కడుపులు నింపుతా
నన్ను నరికేవానికైనా రేపుకాల్చే కట్టెనౌతా...!
నేను పొంగేనదినౌతా
ఉప్పొంగే కడలినౌతా మీరు
పర్యావరణాన్ని పాతరేస్తే
నేను ఆగ్రహిస్తే ఆలితీరాన్ని దాటేస్తే
మీ అందరి బ్రతుకులు అంధకారమే
గాఢాంధకారమే...జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త...!



