అత్యవసరనిధి ఎంతో అవసరం
ఉద్యోగం చేసే రోజుల్లో
ఆదాయం క్రమం తప్పకుండా వస్తుంది కాని
పదవీ విరమణ చేసిన తర్వాత అది ఆగిపోతుంది
కాని "ఒక అత్యవసరనిధి" అంటూ ఉంటే తిరిగి
ఆనిధి ద్వారా ఆదాయం క్రమం తప్పకుండా వస్తుంది
ఆపైన ఎవరిపైనా ఆధారపడే పని వుండదు
అందుకే ఓ నిధిని ఏర్పాటు చేసుకోవాలి
ఒక పద్దతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం
వీలైనంత త్వరగా పొదుపును ప్రారంభించాలి
ఆ పొదుపును అత్యంత తెలివిగా
పెట్టుబడి, సురక్షితంగా ఉండేలా
రాబడికి ఖచ్చితమైన హామీనిచ్చే
వివిధ పథకాలలో మదుపు చేయాలి
చెరువుకు తూముంటే నష్టం లేదు
చెరువుకు గండి పడితేనే ప్రమాదం
నిధి కూడా ఒక చెరువు లాంటిదే
నీ కష్టార్జితాన్ని నీవే కడవరకు అనుభవించాలి
ఆర్జించిన నీ ఆస్తిని అందరికీ పంచకు
పంచి ఆకలికి అలమటించకు అడుక్కోకు
అనాధాశ్రమం చేరి అస్థిపంజరంగా మారకు



