మనం మన పక్కింటివాళ్లతో
పోటీ పెట్టుకోరాదు
కారణం వాళ్ళ పిల్లలు పెద్దవారు
మన పిల్లలు చిన్నవారు
వాళ్ళు అప్పుల్లో పీకలదాకా మునిగిఉన్నారు
మనకు బ్యాంకులో డిపోజిట్లు ఉన్నాయి
వారి కంటే మనం భగవంతుని దయవల్ల
చాలా వరకు మెరుగే
మనం ఇన్వెస్ట్ చెయ్యగల స్థితిలో వున్నాము
వారు ఇన్వెస్ట్ చెయ్యలేరు చేసే స్థితిలోలేనేలేరు
చెయ్యలేని వారే ఏవో కుంటిసాకులు చెబుతారు
ఆడలేక మద్దెల ఓడన్నట్లు
అందని ద్రాక్ష పండ్లు చేదన్నట్లు
అందుకే వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకుంటే
బాధలు పడతాము భారీగా నష్టపోతాము
వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోరాదు
ముందుచూపు లేని వారి మాటలు వింటే
మనం ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేము
వారు మన ముందరి కాళ్ళకు బందాలు వేస్తారు
మన పక్కనే వున్నా మన బాగు కోరుకునేవారు
చాలా తక్కువని మనం త
నేడు నాటిన చిన్న మొక్కలే రేపు చెట్లవుతాయి
నేడు లక్షలు పోసి కొన్న ప్లాట్లే రేపు కోట్లవుతాయి



