Facebook Twitter
అందరికీ ఆదర్శంగా

అతిగా ఆలోచించేవారు
ప్రతిదీ భూతద్దంలోచూస్తారు

ప్రతిదీ భూతద్దంలోచూసేవారికి
గండు చీమసైతం
గర్జించే సింహంలా
తాడు సైతం
త్రాచుపాములా కనిపిస్తుంది

అతిగా ఆలోచించేవారు
అందరిని అన్నిటిని అనుమానిస్తారు
అందరిని అన్నిటిని అనుమానించేవారు
అడుగు ముందుకెయ్యలేరు

అడుగు ముందుకెయ్యలేనివారు
అభివృద్ధి చెందలేరు
అభివృద్ధి చెందలేనివారే
బ్రతుకు మీద ఆశను పూర్తిగా కోల్పోతారు

బ్రతుకు మీద ఆశను
నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయినవారే
భవిష్యత్తులో భారీగా
అతి భయంకరంగా నష్టపోతారు

అలా నష్టపోయినవారే
రేపు నలుగురిలో నవ్వులపాలౌతారు

చివరికి వారి కుటుంబసభ్యులు సైతం
ముందు చూపులేక ఆస్తులు ఆర్జించని
ఇంటి యజమానిని ముసలితనంలో
మూలకు నెట్టేస్తారు ఇంతముద్ద కూడ పెట్టరు

అందుకే
అతిగా ఆలోచించక
అతిగా అనుమానపడక

కొంచెం తెలివిగా కొంచెం ధైర్యంతో
ఫ్లాట్లలో కొంచెం పెట్టుబడి పెట్టినవారు
కొంచెం నమ్మకంతో కొంచెం ఆశతో
నేడు ముందుకెళ్ళినవారే

రేపు కలలో కూడా ఊహించని
లాభాలను పొందుతారు
లక్షాధికారులౌతారు ఆపై
కోటీశ్వరులై కొండపై కూర్చుంటారు

అట్టివారే అదృష్టవంతులు
అందరికీ ఆదర్శమూర్తులు