Facebook Twitter
చీకటిలో చిరుదీపం మన చిరునవ్వే!

పరమశత్రువులు సైతం
ప్రాణమిత్రులయ్యేదెప్పుడు ?
మనం చిరునవ్వుతో
స్నేహహస్తాన్ని అందించినప్పుడు ?

ఎంతటి ఖఠినులైనా సరే ఇట్టే కరిగిపోదెప్పుడు ?
మనం ఒక చక్కని చిరునవ్వును చిందించినప్పుడు?

ఆ చిరునవ్వు మనముఖాన చిగురించేదెప్పుడు ?
మన మనసే ఒక మహాఆనందసాగరమైనప్పుడు ?

మనముఖాలు వెలుగుమయమయ్యేదెప్పుడు ?
మన చిరునవ్వే ఒక సూర్యబింబమైనప్పుడు ?

మన చుట్టూఉన్న చిమ్మచీకటి తొలిగేదెప్పుడు ?
మనందరి హృదయాలలో
ఆనందదీపాలు వెలిగేదెప్పుడు ?
మన చిరునవ్వే ఒక ఆరని దీపమైనప్పుడు ?

మనం రోజంతా ఉల్లాసంగా
ఉత్సాహంగా  ఉండేదెప్పుడు ?
మన చిరునవ్వే ఒక దివ్యఔషధమైనప్పుడు ?

మనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చేదెప్పుడు ?
మన చిరునవ్వే ఒక వజ్రాయుధమైనప్పుడు ?