నవ దంపతులు
ఓ నవ దంపతులారా!
వింటారా! నా ఈ మంచిమాట !
స్వచ్చమైన అద్దంలోనే
నిశ్చలమైన నీటిలోనే
మనం మన ప్రతిబింబాలను
స్పష్టంగా చూసుకోగలం
అల్లకల్లోలమైన నీటిలో కాదు
పగిలిన, మురికి పట్టిన అద్దంలో కాదు
అలాగే,
మన మనసు ప్రశాంతంగా ఉంటేనే
మన ప్రశ్నలకు, జవాబులు
సందేహాలకు, సమాధానాలు
సమస్యలకు, చక్కనిపరిష్కారాలు
దొరుకుతాయి
గద్దింపులు,గాండ్రింపులు
ఘర్షణలు వద్దేవద్దు
ఒకరినొకరు గౌరవించుకోండి
ఒకరినొకరు ప్రేమించుకోండి చాలు
అంతే కానీ,
పంతాలు, పట్టింపులు
పగలు, ప్రతీకారాలు వద్దేవద్దు
ఒకరినొకరు అభిమానించుకోండి
ఒకరినొకరు ఆరాధించుకోండి చాలు



