Facebook Twitter
మనిషి ఉండాలి మధ్యస్తంగా

నిత్యం ఇది నగ్న సత్యం
సూర్యుని చుట్టు
భూమి తిరుగుతున్నట్లు
దైవం చుట్టు మనిషి  
తిరుగుతూ ఉంటాడు

కాని
ఆ దైవాన్ని దర్శించాలన్న ఆశతో
మనిషి దైవానికి అతి చేరువగా వెళ్తే
మసైపోతాడు మాయమైపోతాడు

వెయ్యి సూర్యుల సమమైన
ఆ దివ్యతేజోమయున్ని
తన రెండుకళ్ళతో వీక్షించలేక
కళ్ళు మూసేస్తాడు
కనుమరుగౌపోతాడు

అలాగే దైవానికి
మారీ దూరంగా ఉన్న మనిషి
అజ్ఞానంలో అంధకారంలో
మునిగి ఉంటాడు

అందుకెే మనిషి ఉండాలి
మధ్యస్తంగా అప్పుడే 
నిత్యం వెలుగుతూ వుంటాడు
అందరికి వెలుగునిస్తాడు

సూర్యుని కంటే ముందు లెయ్
సుఖపడతావు

పుష్టికరమైన ఆహారం తీసుకో
షష్టిపూర్తి చేసుకుంటావు

నియమబద్ధ జీవితమే నిత్యసుందరం
దయ గల హృదయమే దైవ మందిరం