Facebook Twitter
ఏం లాభం రా వెర్రివాడా!

ఉద్యోగం పేరుతో

పగలు పదింటికి ఆఫీసుకెళ్ళి

ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి

ఏ అర్ధరాత్రో ఏ అపరాత్రో ఆటోలో

భార్య ఒక్కతే ఇంటికొస్తుందని

ఏ దిక్కూమొక్కులేని నక్కతో

నక్కినక్కి తిరుగుతుందని అనుమానంతో

నిక్కినిక్కి చూసి అయ్యో

దారితప్పిపోయిందేమోనని ఇప్పుడు

వెక్కివెక్కి ఏడ్చిి...ఏం లాభం రా వెర్రివాడా!

 

నీవు TV ని

కొన్నావో దాన్ని

కట్టుకున్నావో అర్ధం కాదాయె

భార్యతో కలిసి భోంచేసింది లేదాయె

ప్రేమతో పలకరించింది లేదాయె

కమ్మని కబుర్లు చెప్పింది లేదాయె

వీకెండ్సులో పార్టీలకో

పార్కులకో తిప్పింది లేదాయె

సినిమాలకో షికార్లకో తీసికెళ్ళింది లేదాయె

సరదాగా సరసమాడింది లేదాయె

సంబరపడింది లేదాయె

పక్కకుచేరి పరవశింపచేసింది లేదాయె

అయ్యో నా భార్య గడప దాటిపోయిందేనని

ఇప్పుడు గగ్గోలుపెట్టి గార్దభంలా

ఓండ్రపెట్టి...ఏం లాభం రా వెర్రివాడా !

ముందుండాలి కదరా ముందుజాగ్రత్త మూర్ఖుడా !