మనుషుల్లో దేవుళ్ళు…
తిను...త్రాగు...సుఖించు
"ఈ మూడు" సుఖజీవన సూత్రాలు
పాటించేవారంతా ...అంధులే...అజ్ఞానులే
ఆదాయం...ఖర్చు
పొదుపు...మదుపు
"ఈ నాలుగు" ఆర్థిక మంత్రాలు
జపించేవారంతా..."ముందుచూపు"గలవారే
ధనవంతులే....ధన్యజీవులే
ఆలోచన,అన్వేషణ
పరిశోధన "ఈ మూడు" మార్గాలలో
ప్రయాణించేవారు..."విజేతలే... విశ్వవిజేతలే
కాని,
చెవులతో విని కళ్ళతో చూసి
సమయస్ఫూర్తితో వ్యవహరించేవారు
నోటితో మాట్లాడేవారు మనసుతో గ్రహించేవారు
సమస్యలపై తక్షణమే స్పందించేవారు
సమాజశ్రేయస్సు కోసం సర్వం త్యాగం చేసేవారు
సంఘసంస్కర్తలే...మహాత్ములే...మనుషుల్లోదేవుళ్ళే



