మానవ జన్మ ?(పార్ట్...3)
ఎత్తుపల్లాలే లేకుంటే...
అది దారి ఎలా ఔతుంది ?
ఆశల ఆరాటమే లేకపోతే...
అది జీవితమెలా ఔతుంది ?
ఆపదలో ఆదుకోకపోతే...
అది స్నేహమెలా ఔతుంది ?
ఒకరు ఓడి పోకపోతే...
అది గెలుపెలా ఔతుంది ?
తొండమే లేకపోతే...
అది ఏనుగెలా ఔతుంది ?
జింకలను వేటాడకపోతే...
అది పులెలా ఔతుంది ?
కమ్మగా పాడకపోతే...
అది కోయిలెలా ఔతుంది ?
పురివిప్పి ఆడకపోతే...
అది నెమలెలా ఔతుంది ?
మూడుముళ్ళు పడకపోతే...
అది పెళ్ళెలా ఔతుంది ?
పిల్లలను కనకపోతే...
ఆమె తల్లెలా ఔతుంది ?
సమస్యలే లేకపోతే...
అది సంసారమెలా ఔతుంది ?
మంచిని తలపెట్టక పోతే...
అది మనిషి జన్మ ఎలా ఔతుంది?



