లోపాలు...పాపాలు...శాపాలు..
మన అంతరంగాన
దూరి తిష్ట వేసిన ఆ
దుష్ట నికృష్ట తలంపులే
మనల్ని భయపెట్టే "భూతాలు"
ఆ అసూయా ద్వేషాలే
అత్యాశ అహంకారాలే
కసి కక్ష పగా ప్రతీకారాలే
మోసాలు దగా దౌర్జన్యాలే
మనలో కనిపించని పెద్ద "లోపాలు"
ఆ "లోపాలు" పెరిగితే పాపాలౌతాయి
ఆ "పాపాలు" ముదిరితే శాపాలౌతాయి
ఆపై పచ్చని బ్రతుకులు...నరకకూపాలౌతాయి
అందమైన జీవితాలు...ఆరిపోయే దీపాలౌతాయి
తస్మాత్ జాగ్రత్త! అందుకే అంటారు
చిత్తశుద్ధిలేని శివపూజలెందుకని....
మాలిన్యంలేని మనసే దైవమందిరమని..



