మనిషి జన్మ ? (పార్ట్...2)
ప్రత్యర్థులే లేకపోతే...
అది పోటీ ఎలా ఔతుంది?
చిమ్మచీకటినే చీల్చకపోతే...
అది దీపమెలా ఔతుంది?
త్యాగమే చేయకపోతే...
ఆమె దేవత ఎలా ఔతుంది?
లోతుగా అన్వేషించకపోతే...
అది సత్యమెలా ఔతుంది ?
కళ్ళు ఎర్రబడకపోతే...
పళ్ళు పటపటా కొరక్కపోతే...
అది కోపమెలా ఔతుంది ?
లాభనష్టాలు రాకపోతే...
అది వ్యాపారమెలా ఔతుంది ?
కళ్ళుపొరలు కమ్మకపోతే...
అది కామమెలా ఔతుంది ?
ముద్దుమురిపాలు లేకపోతే...
అది ప్రేమ ఎలా ఔతుంది ?
అన్యాయాన్ని ప్రశ్నించకపోతే...
అది తిరుగుబాటెలా ఔతుంది?
దుర్మార్గాన్ని ప్రతిఘటించకపోతే...
అది పోరాటమెలా ఔతుంది?
మంచిని తలపెట్టక పోతే....
అది మనిషి జన్మ ఎలా ఔతుంది?



