మనిషి జన్మ? (పార్ట్...1)
సమాధానమే లేకపోతే...
అది ప్రశ్న ఎలా ఔతుంది?
పరిష్కారమే లేకపోతే...
అది సమస్య ఎలా ఔతుంది?
ఒడిదుడుకులు
ఓటమి గెలుపులు
ఆటుపోట్లు లేకపోతే...
అది జీవితమెలా ఔతుంది?
కొందరినైనా మార్చకపోతే...
అది సందేశమెలా ఔతుంది?
కల్పిత పాత్రలే లేకపోతే...
అది సినిమా ఎలా ఔతుంది ?
అక్షరాలు పేజీలు లేకపోతే...
అది పుస్తకమెలా ఔతుంది?
ముంజేతి గాజులు
పాదాలకు పారాణి
నుదుట బొట్టు లేకపోతే...
ఆమె ముత్తైదువెలా ఔతుంది ?
కలతలు కలహాలు లేకపోతే...
అది కాపురమెలా ఔతుంది?
ముద్దూ ముచ్చట లేకపోతే...
అది శృంగారమెలా ఔతుంది?
అలలు ఎగసి ఎగసి పడకపోతే...
అది సముద్రమెలా ఔతుంది?
మంచిని తలపెట్టక పోతే...
అది మనిషి జన్మ ఎలా ఔతుంది?



