Facebook Twitter
రెండొందల గ్రాముల ప్రేమ

అంటారు
అనుభవజ్ఞులు
సంసారం
ఒక సాగరమని
సంసారం "ఒక తక్కెడని"
రెండు వైపులా 
"రెండొందల గ్రాముల ప్రేమే" ఉంటే
ఇక ఎక్కువ తక్కువ
"తేడాలెక్కడని" ?
ఓ సరసం
ఓ సరదా
ఓ సంతోషం
ఓ మంచితనం
ఓ మానవత్వం
ఓ సహనం
ఓ సమానత్వం
ఓ సర్దుబాటుగుణం
ఓ సమయస్ఫూర్తి
ఓ స్వచ్చమైన ప్రేమ
రెండు హృదయాలలో
ప్రవహించినంతకాలం
అది ఓ పచ్చనిసంసారమే
ఓ మధురమైన
ఓ మంగళకరమైన
ఓ మనోహరమైన
ఓ సుమధురమైన
ఓ శుభకరమైన
ఓ సుందరమైన నందన వనమే...
అంతులేని ఓ ఆనంద సాగరమే...