నిండు కుండలా ? మంచు కొండలా ?
మీరు
మీ కుటుంబం
పెరటిలో చెట్ల
పచ్చగా ఉండాలంటే
చెరువులో చేపల్లా
స్వేచ్ఛగా బ్రతకాలంటే
నిండుకుండల్లా
నిశ్చింతగా ఉండాలంటే
మంచు కొండల్లా
చల్లగా జీవించాలంటే
చీకటి పడకముందే
దీపం వెలిగించుకోండీ
ఆదాయముండగానే
ఖర్చులు అదుపు చేసుకోండి
క్రమపద్దతిలో పొదుపు చేసుకోండి
ధైర్యంగా మదుపు చేసుకోండి
ధీమాగా తిరగండి దర్జాగా బ్రతకండి
ధన్యులై స్పూర్తి ప్రదాతలై జీవించండి



