అసాధ్యం అసంభవం
ముందుచూపులేని
మూర్ఖుల మాటలు వినడం
సన్యాసుల
సలహాలు స్వీకరించడం
గుడ్డివానికి
అద్దం చూపించడం
చెవిటివాని
ముందు శంఖమూదడం
దండగా శుద్ధదండగ
ఏనుగు పిల్లల్ని
ఎవరెస్టు శిఖరమెక్కించడం
దాహంవేయని గుర్రాలచే
నీళ్లు త్రాగించడం
బద్దకించే గాడిదలచే
బట్టలు మోయించడం
కొమ్మల్లో దాగిన కోతినుండి
కొత్త సెల్లులాక్కోవడం
అసాధ్యం అసంభవం



