Facebook Twitter
చింతకాయ -  చిత్తంలో మాయ

పుల్లని చింతకాయను తినాలన్న
గట్టికోరిక ఒక్కటి మనసులో పుట్టగానే
ప్రత్యక్షంగా దాన్ని చేత్తోపట్టుకోగానే 
నోటిలో పెట్టుకోగానే కొంచం కొరగ్గానే
ఎవరి నోటిలోనైనా లాలాజలం 
ఇట్టే గంగలా ఉప్పొంగుతుంది

ఇదేమి వింత? ఇదేమి మాయ? 
ఇంతటి శక్తి ఎక్కడిదే నీకు ఓ చింతకాయ

అలాగె  
ఒక్క చిన్న చిరునవ్వు   
ముఖంలో వెలిగించుకోగానే 
చిత్తంలో కమ్ముకున్న
చిమ్మచీకట్లు చింతలు 
చీకాకులు తప్పక తొలిగిపోతాయి 
కారు మబ్బుల్లా కలతలు కరిగి పోతాయి 
తెల్లని మేఘాల్లా కలహాలు తేలిపోతాయి 

చింతకున్న ఆ శక్తి మరి
చిరునవ్వుకుండదా? 

అలాగే నిత్యం
నిష్ఠతో దైవాన్ని ధ్యానిస్తే  
భక్తితో పగలు రాత్రి ప్రార్దిస్తే  
తప్పక ఆ భగవంతుడు  
కరుణిస్తాడు కనిపిస్తాడు
కోరిన కోర్కెలు తీరుస్తాడు

చింతకున్న ఆ శక్తి మరి
భగవంతునిపై నున్న భక్తికుండదా? 

ఔను వుంటుంది ఇది నగ్నసత్యం 
అందుకే ధ్యానించండి 
భక్తితో భగవంతున్ని ప్రతినిత్యం  
అలాగే నవ్వండి 
నవ్వించండి నవ్వుతూ బ్రతకండి
అప్పుడే పొంగిపొర్లుతుంది గోదారిలా
ప్రతివ్యక్తిలో గుండెల్లో 
మంచితనం మానవత్వం