వరిపిండి చెక్కలు (సంక్రాంతి స్పెషల్)
సంక్రాంతి పండుగ దగ్గర్లో ఉంది కదా. ఇక అందరి ఇళ్లల్లో పిండి వంటలు గుమగుమలాడి పోతాయి. సంక్రాంతి వంటకాల్లోనే ఒకటి వరిపిండి చెక్కలు. ఈ వరిపిండి చెక్కలు ఎలా తయారుచేసుకోవాలో ఈవీడియో చూసి నేర్చుకోండి.
కావలసిన పదార్ధాలు:-
బియ్యంపిండి - 1 గ్లాసు
ఉప్పు - 1 / 2 చెంచాలు
శెనగ పప్పు - 2 చెంచాలు
నువ్వులు - చెంచా
జీలకర్ర - 1 చెంచా
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 8 to 10
అల్లం - అంగుళం ముక్క
బటర్ - 2 చెంచాలు
నూనె - వేయించడానికి సరిపడా
తయారీవిధానం :-
పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర, కచ్చగా దంచుకోవాలి. నీళ్లు సుమారు 1 / 2 గ్లాసు తీసుకుని... దళసరి గిన్నెలో వేడిచేసి అందులో బటర్ (లేదా) నూనె ఉప్పు వేసి మరిగే నీటిలో శెనగసపప్పు, నువ్వులు వేసి దంచి ఉంచుకున్న పచ్చి మసాలా కారం వేసి స్టవ్ ఆఫ్ చేసి వరిపిండి కొద్దిగా వేస్తు నీళ్ళలో ఉండలు లేకుండా కలుపుకుని.. ఉప్పి మూతపెట్టి ప్రక్కన ఉంచుకోవాలి ...స్టవ్ మీద నూనెమూకుడులో నూనె కాగేలా ఉంచుకొని... ఈ వరిపిండి ముద్దను నూనె చేతితో బాగా కలుపుకుని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కవరు మీద పలుచని పూరీల్లా వత్తుకుని నూనెలో వేయించుకోవాలి. బంగారు ఛాయ వచ్చేలా కరకర లాడేలా వేయించుకుని టీష్యూ పేపరు పైకి తీసుకోవాలి. ఈ చెక్కలను పూరీ మిషన్ తో కూడా వత్తుకోవచ్చు ... రెండు వారాలపైగా నిలువ వుండే ఈ చెక్కలు చాలా రుచిగా ఉంటాయి.