కొబ్బరి, బెల్లంతో బర్ఫీ

కావాల్సిన పదార్థాలు:

పచ్చికొబ్బరి ముక్కలు - 1కప్పు

కాచి చల్లార్చిన పాలు - ముప్పావు కప్పు

బెల్లం తురుము -ముప్పావుకప్పు

యాలకులు - 3

నెయ్యి- పావు కప్పు

శనగపిండి - ఒకకప్పు

తయారీ విధానం :

ముందుగా జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పాలు, బెల్లం తురుము, యాలకులు మెత్తగా గ్రైండ్ చేయాలి.తర్వాత ఒక బాణాలి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత శనగపిండి వేసి కలుపుతూ వేయించుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించి తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత దీనిని మరో 5 నిమిషాల పాటు కలుపాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసి కలపాలి. దీనిని బాణాలికి అంటుకోకుండా వేరయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కొబ్బరి మిశ్రమాన్ని ఇలా ఉడికించిన తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టప్ ఆఫ్ చేయాలి. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే రుచికరంగా ఉండే కోకనట్ బర్ఫీ రెడీ.