కొబ్బరి బూరెలు!

తయారీ విధానం:

మినపపప్పు - 1 కప్పు

బియ్యం పిండి- 2కప్పులు

ఉప్పు - తగినంత

బెల్లం తురుము - 1 కప్పు

పచ్చికొబ్బరి తురుము - 3 కప్పులు

జీడిపప్పు పలుకులు- పిడికెడు

యాలకుల పొడి- అర టీస్పూన్

నూనె - డీ ఫ్రైకు సరిపడా

తయారీ విధానం:

కొబ్బరి బూరెలు తయారు చేసే ముందు..జార్ తీసుకుని అందులో మినపపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లించి ఒక గిన్నెలోకి తీసుకుని అందులో బియ్యంపిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని కలపాలి.ఈ పిండిపై మూతపెట్టి గంటపాటు నాననివ్వాలి. తర్వాత ఒక కళాయిలో బెల్లం, కొబ్బరి తురుము వేసి కలుపుతూ వేడిచేసుకోవాలి. ఇలా 15నిమిషాలపాటు వేడి చేసిన తర్వాత జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి అంతాకలిసేలా కలుపుకోవాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు అలాగే వేడిపై కలిపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని...అందులో రెండు టీ స్పూన్ల బియ్యం పిండి వేసి కలిపి చల్లారనివ్వాలి. కొబ్బరి మిశ్రమం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన పిండిలో కొన్ని నీళ్లు పోసి పిండిని కావాల్సినంత పలుచగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెయ్యాక కొబ్బరి ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఇలా నూనెలో 4 లేదా 5 ఉండలను వేసుకుని ...మీడియం మంటలపై అటూ ఇటూ కలుపుతుండాలి. ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన కొబ్బరి బూరెలు రెడీ అవుతాయి.