ఖస్తా కచోరీ

కావాల్సిన పదార్థాలు:

మైదాపిండి - 1 కప్పు

పెసర పప్పు - 1కప్పు

శనగ పప్పు - 2 టేబుల్ స్పూన్స్

కారం పొడి - పావు టీ స్పూన్

జీలకర్ర - 1 టేబుల్ స్పూన్

సోంపు - 1 టేబుల్ స్పూన్

పసుపు - హాఫ్ టీ స్పూన్

కొత్తిమీర - 1 టీస్పూన్

ఇంగువ - చిటికెడు

యాలకుల పొడి- హాఫ్ టీ స్పూన్

నూనె- వేయించడానికి సరిపడా

ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

క్రిస్పీ కచోరీ తయారు చేయడానికి ముందు పెసరపప్పును మూడు గంటలపాటు నానబెట్టండి. తర్వాత పప్పులో నీటిని తీసి మీక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాత్రలోకి తీసుకుని పక్కకు పెట్టండి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో మైదాపిండి వేసి ఒక టేబుల్ స్పూన్ నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. కొద్దిగా నీరు పోస్తూ పిండిని గట్టిగా కలపండి. తర్వాత దానిపై ఒక గుడ్డతో కప్పండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె వేడెయ్యాక అందులో జీలకర్ర, పెసరపప్పు, ధనియాలు పొడి, కొత్తిమీర, ఎర్రకారం, పసుపు శెనగపిండి వేసి కలపాలి.

అందులో శెనగపిండిని వేసినప్పుడు స్టౌ సిమ్ లో పెట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన పెసరపప్పు పేస్టు వేసి కలుపుతూ ఉడికించండి. తర్వాత యాలకుల పొడి, ఉప్పు వేసి మరోసారి కలపండి. దగ్గరకు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టిన పిండిని తీసుకుని రౌండ్ బంతుల్లా తయారు చేసుకోండి. ఒక బంతిని తీసుకుని అర చేతిలో నొక్కి రౌండ్ చేసుకుండి. అందులో ఈ మిశ్రమాన్ని పెట్టి గ్రుండంగా చేయండి.

అరచేతిలో ఉంచి అంచులను నొక్కి పూరి ఆకారంలో రోలో చేయండి. రోల్ చేసేప్పుడు కొద్దిగా మందంగా ఉండాలి. అన్నింటిని ఆ విధంగా చేసి...కాగుతున్న నూనెలో వేయండి. మీడియం మంటపై వేయించండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్పీ కచోరీలు రెడీ. గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.