సాబుదానా హల్వా

 

కావాల్సిన పదార్థాలు:

సాబుదానా - 1 కప్పు

ఏలాకులు - 3

బాదం - 10

జీడిపప్పు -10

కుంకుమ పువ్వు -1 టీస్పూన్ పాలలో నానబెట్టినవి

దేశీ నెయ్యి - 4 టేబుల్ స్పూన్స్

పంచదార - అర కిలో

తయారీ విధానం:

సాబుదానా హల్వా తయారు చేయడానికి ముందుగా సాబుదానాను ఒకపాత్రలో వేసి రెండు మూడు సార్లు కడగాలి.

తర్వాత వాటిని ఒక గంటపాటు నానబెట్టాలి.

ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.

అందులో నానబెట్టిన సాబుదానాను వేసి కాసేపు కలుపుతూ వేయించాలి.

సరిగ్గా వేగిన తర్వాత ..గోధుమ రంగులో వస్తుంది. ఇప్పుడు అందులో రెండు కప్పుల నీరు పోయాలి.

నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. మెత్తగా అయ్యాక కుంకుమ పువ్వు మిక్స్ చేసిన పాలు, చక్కెర వేసి కలపాలి.

5 నుంచి 7 నిమిషాలు ఉడికించిన తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు, బాదం ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి.

అంతే సాబుదానా హల్వా రెడీ.