ఉండ్రాళ్లు
కావలసిన పదార్థాలు:
బియ్యపు రవ్వ- 1 కప్పు
నీళ్ళు- 1 -1/2 కప్పులు
శనగపప్పు- 1/2 కప్పు
జీలకర్ర: సరిపడా
నూనె: వత్తడానికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి కాగిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత దాంట్లో నీళ్లు పోసి ఉప్పు వేయాలి. మరిగిన తరవాత శనగపప్పు, బియ్యం రవ్వ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద ఉడికించాలి. దించే ముందు నెయ్యి వేయాలి. తర్వాత కిందకు దింపాలి. చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు చుట్టాలి. అంతే సింపుల్ ఉండ్రాళ్లు రెడీ అవుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వీటిని కేవలం బియ్యప్పిండితో మాత్రమే తయారు చేస్తారు.