ఉండ్రాళ్ళు (వినాయక చవితి స్పెషల్)
కావాల్సిన పదార్ధాలు:-
1కప్పు - బియ్యం రవ్వ
2కప్పుల - నీళ్లు
3స్పూన్లు - శెనగ పప్పు
1స్పూను - జీలకర్ర
నెయ్యి - తగినంత
ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం:-
* ముందుగా శెనగ పప్పు కడిగి నీటిలో ఒక గంట నానబెట్టాలి . ఆ తర్వాత, పెద్ద బాండీ లో నీళ్లు పోసి , అవి మరుగుతూండగా శెనగ పప్పు వేసి ఉడికించాలి. పప్పు కొంచెం ఉడకగానే, జీలకర్ర వేసి, ఉప్పు, కొంచెం నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు, రవ్వని మెల్లగా ఆ మరుగుతున్న నీళ్లలో వేస్తూ, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలీ.
* ఇది, ఉప్మా లాగ దగ్గరికి రాగానే, స్టవ్ ఆపేసి, ఆ గిన్నె లోని మిశ్రమాన్ని ఒక పళ్లెం లో వేసుకుని కాస్త చల్లారనివ్వాలి.
* ఇప్పుడు, ఆ మిశ్రమంతో , చిన్న చిన్న ఉండలు చేసి (అరచేతికి నెయ్యి రాసుకుంటూ), ఆ ఉండలను ఒక వెడల్పు గా వున్న పాత్ర లోకి కానీ, కంచం లో కానీ ఉంచి , ఆవిరి పై ఉడికించాలి.
అంటే, ప్రెషర్ కుక్కర్ లో గాని లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ లోగానీ అన్న మాట.
* ఇలా ఉడికిన ఉండ్రాళ్ళను, వినాయకుడికి నైవేద్యం గా సమర్పించుకోవటం మన సంప్రదాయం.
ఇది ఆ గణ నాయకుడికి చాలా ఇష్టమైన పదార్థమే కాక, పిల్లలు కూడా ఇష్టం గా తింటారు.
-భారతి