మ్యాంగో స్వీట్
ఉగాది ఇంక ఐదు రోజులలోకి వచ్చేసింది. మనం సంప్రదాయంగా చేసే ప్రసాదాలతో పాటు, కొన్ని పిల్లలు ఇష్టంగా తినే స్వీట్స్ కూడా నేర్చుకుందాం ఈ 5 రోజులూ...! ఉగాది రోజు నుంచి మామిడి వాడకం మొదలవుతుంది మన వంటలలో కదా. మరి మొదట మామిడితో చేసే స్వీట్ ఐటమ్ ఈ రోజు...
కావలసిన పదార్థాలు:
మాంగో ప్యూరీ - 3 కప్పులు
నెయ్యి - అర కప్పు
పంచదార - 3 కప్పులు
జీడిపప్పులు - తగినన్ని
తయారీ విధానం:
ముందుగా మామిడి పళ్ళ నుంచి రసం తీసి, వడగట్టి పెట్టుకోవాలి. ఆ రసాన్ని గ్రైండ్ చేస్తే ప్యురీలా చిక్కగా వస్తుంది. ఆ ప్యూరీకి పంచదారని కలిపి.. ఒక బాణలిలో కొంచెం నెయ్యి వేసి మామిడి మిశ్రమాన్ని చేర్చి, కదుపుతూ వుండాలి. సన్నని మంటమీద ఉంచితే, పంచదార కరిగి, పాకంలా వచ్చి, అందులో మామిడి రసం కూడా ఉడుకుతుంది. హల్వా లా మిశ్రమం కొంచం గట్టి పడ్డాక, నేతిలో వేయించిన జీడిపప్పుని చేర్చితే మాంగో హల్వా రెడీ అయినట్టే.
-రమ