స్వీట్ రోజెస్

 


స్వీట్లు  ఇష్టపడేవాళ్ళు ఈ స్వీట్ రోజెస్ టేస్ట్ చేస్తే మనసుపారేసుకోక మానరు. గులాబీ పువ్వుల్లాంటి ఈ స్వ్వేట్ రొజెస్ ఎలా తయారుచెయ్యాలో చూద్దామా.

 

కావాల్సిన పదార్థాలు:
 

మైదాపిండి                                      - 1/2 కప్పు

గోధుమపిండి                                   - 1/2 కప్పు

బొంబాయి రవ్వ                               - 1 స్పూన్

పంచదార                                        - 1 కప్పు

యాలకుల పొడి                               - తగినంత

ఫుడ్ కలర్                                        - తగినంత

ఉప్పు                                               - చిటికెడు

నూనే                                               - తగినంత


తయారి విధానం:

* ఈ స్వీట్ రోజెస్ తయారుచేయటానికి ముందుగా మైదాపిండి, గోధుమపిండి, బొంబాయిరవ్వ ఈ మూడింటిని కలిపి ఆ పిండిలో 1స్పూన్ నూనే, చిటికెడు ఉప్పు వేసి, నీళ్ళను కూడా కలిపి పూరి పిండిలా  తడిపి పెట్టుకోవాలి.

* ఈ పిండిని ఒక గంట సేపు నాననివ్వాలి. అలా నానిన పిండిని పెద్ద చపాతిలా వత్తుకోవాలి.

* ఆ చపాతి మరీ పల్చగా కాకుండా, మరీ దళసరిగా కాకుండా చూసుకోవాలి. అలా వత్తిన చపాతి మీద ఇంట్లో ఉండే మూతని పెట్టి వత్తి చిన్నచిన్న పూరిల లాగా కట్ చేసుకోవాలి.

* అలా గుండ్రంగా ఉన్న వాటిని చేతితో గులాబి రేకుల్లాగా మడుచుకుని ఒకదానికి ఒకటి అంటించుకోవాలి.

* ఒక పువ్వుకి నాలుగు రేకులు వచ్చేలా చూసుకుంటే చాలు. ఇలా తయారయిన వాటిని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.

 

* మరొక కడాయిలో ఒక గ్లాసు నీళ్ళల్లో పంచదార వేసి లేత పాకం తీసుకోవాలి. ఆ పాకంలో యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకోవాలి.

* అలా తయారయిన పాకంలో గులాబీ పువ్వులు ముంచి తీసుకోవచ్చు లేదా ఆ పువ్వులపైన పాకం వెయ్యచ్చు. అంతే స్వీట్ రోజెస్ రెడీ.


..కళ్యాణి