షీర్ కుర్మా

 

 

 

కావలసిన పదార్థాలు:

వెర్మిసెల్లీ                                            - అరకప్పు
పాలు                                                - ఒక లీటరు
చక్కెర                                               - పావుకప్పు
డ్రై ఫ్రూట్స్                                           - అరకప్పు
మిల్క్ మెయిడ్                                   - అరకప్పు  
నెయ్యి                                               - రెండు చెంచాలు
యాలకుల పొడి                                 - అరచెంచా
కుంకుమపువ్వు                                - చిటికెడు
సగ్గుబియ్యం                                      - రెండు చెంచాలు
జీడిపప్పు పేస్ట్                                   - ఒక చెంచా
బాదం పేస్ట్                                        - ఒక చెంచా

 

తయారీ విధానం:

సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత స్టౌ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ ని వేయించి తీసేయాలి. తరువాత వెర్మిసెల్లీని వేసి వేయించాలి. ఎరుపు రంగు వచ్చాక పాలు పోయాలి. యాలకుల పొడి, కుంకుమపువ్వు, సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించాలి. సగం ఉడికాక జీడిపప్పు, బాదం పేస్టుల్ని కూడా వేసి కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకూ సన్నని మంట మీద ఉడికించాలి. చిక్కబడుతున్నప్పుడు మిల్క్ మెయిడ్ వేసి బాగా కలపాలి. నాలుగైదు నిమిషాలు పాటు ఉడికించి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించేయాలి.

- Sameera