చిలగడదుంప హల్వా
కావలసిన పదార్థాలు:
చిలగడదుంపలు - పావుకిలో
పాలు - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
నెయ్యి - ఐదు చెంచాలు
యాలకుల పొడి - అరచెంచా
దాల్చినచెక్క పొడి - అరచెంచా
జీడిపప్పులు - కావలసినన్ని
తయారీ విధానం:
చిలగడదుంపల్ని చెక్కు తీసేసి, ఉడికించి, మెత్తని పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేయాలి. వేడెక్కాక జీడిపప్పు వేసి, వేయించి తీసేయాలి. తరువాత అదే కడాయిలో చిలగడ దుంప పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయే వరకూ వేయించిన తరువాత పాలు వేసి కలపాలి. ఉండ కట్టకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. రెండు మూడు నిమిషాలు అలా ఉడికించాక చక్కెర వేసి మళ్లీ ఉడికించాలి. హల్వా దగ్గరగా అయ్యి అంచుల్ని వదులుతున్నప్పుడు యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. మిశ్రమం బాగా దగ్గరగా అయ్యాక మిగిలిన నెయ్యి వేసి కలిపి దించేయాలి. జీడిపప్పు వేసి సర్వ్ చేయాలి.
- Sameera