నువ్వుల బర్ఫీ
కావలసిన పదార్దాలు:
నువ్వులు - 1 కప్పు
బెల్లం - 1 కప్పు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఒక బాణలి తీసుకొని అందులో నూనె వేయకుండా నువ్వులను దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో మందపాటి పాత్ర తీసుకొని అందులో కొంచం నెయ్యి వేసుకొని.. అది కరిగాక అందులో తురిమి పెట్టుకున్న బెల్లం వేయాలి. బెల్లాన్ని బాగా కలుపుతూ (లేకపోతే గిన్నెకు అంటుకుపోతుంది) కరిగే వరకూ ఉంచాలి. బెల్లం కరిగాక మంట కొంచం తగ్గించి వేయించి పెట్టుకున్న నువ్వులను అందులో వేసి పాకం కొంచం దగ్గర పడేంతవరకూ ఉంచాలి. ఈ లోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసి ముక్కలుగా కోసుకోవాలి. అంతే నువ్వుల బర్ఫీ రెడీ అయినట్టే.