సంక్రాంతి స్పెషల్
మినప సున్నుండలు
కావలసినవి :
మినపగుండ్లు : ఒక కేజి.
నెయ్యి : తగినంత
యాలకుల పొడి : కొద్దిగా
పంచదార : ముప్పావు కేజీ
తయారుచేయు విధానం:
ముందుగా మినపగుళ్ళు ను కొద్దిగా వేయించుకుని చల్లారక మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తరువాత పంచదార కూడా పౌడర్ లా చేసుకోవాలి. ఇప్పుడు మినప్పిండి, పంచదార పౌడర్ కలిపి ఉంచుకోవాలి. తరువాత నెయ్యి ని కరిగించి కలిపి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కావలసిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. అంతే మినప సున్నుండలు రెడీ
*****
కోవా కజ్జికాయలు
కావలసినవి:
మైదా : అరకేజీ
కోవా : రెండు కప్పులు
నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు : చిటికెడు
నూనె : వేపటానికి సరిపడా
కొబ్బరి తురుము : కప్పు
పంచదార పొడి : నాలుగు కప్పులు
యాలుకల పొడి : టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ ( చిన్నగా కట్ చేసుకోవాలి ) - ఒక కప్పు
తయారుచేయు విధానం :
ముందుగా మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి, ముద్దలా చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కోవా వేసి స్టవ్ మీద పెట్టాలి. కాసేపటికి కలర్ మారుతుంది. అప్పుడు స్టవ్ ఆపి, గిన్నెను దించి చల్లారిన తరువాత, దీనిలో కప్పు పంచదారపొడి, యాలుకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు కొబ్బరి తురుము వేసి కలిపి పక్కనపెట్టాలి. ఇప్పుడు కలిపిన మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని చపాతిలా చేసి, మద్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, చపాతి మడిచి, కజ్జికయలా ఒత్తాలి. ఇలా అన్నీ చేసుకున్నాక, స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక కజ్జికాయలు ఒక్కొక్కటిగా వేసి, బాగా వేగనివ్వాలి. పక్క స్టవ్ మీద వేరే గిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళుపోసి లేత పాకం పట్టాలి. ఇప్పుడు వేగిన కజ్జికాయలు తీసిన వెంటనే పాకంలో వేసి కాసేపువుంచి, పాకంలో నుండి తీసి చల్లారనివ్వాలి.
*****
నేతి అరిసెలు
కావలసినవి :
బియ్యం - 2 కేజీ
బెల్లం - 1 కేజీ
నెయ్యి - 200 గ్రాములు
నువ్వులు - కొంచం
తయారు చేసే విధానము :
ముందుగా బియ్యం ఒక్క రోజు ముందు రాత్రే నానా పెట్టుకోవాలి , దాన్ని ఉదయానే పొడి చేసి జలించు కొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ గిన్నెపెట్టి అందులో బెల్లం వేసి సరిపడా నీళ్ళు పోసి పాకం పెట్టాలి, ఇంకో స్టవ్ మీద మూకుడు పెట్టి నెయ్యి వేసి తెల్ల నువ్వులను దోరగా వేయించాలి . పాకం నీ వడ కట్టుకోవాలి. పాకం లో వేయించిన నువ్వులు బియ్యం బిండి వేసి బాగా కలపాలి . తరువాత ఇంకో పొయ్యి మీద మూకుడు పెట్టి నెయ్యి వేసి అందులో బియ్యం మిశ్రామని చిన్న ఉండలుగా చేసి వాటిలిని ఒత్తి నెయ్యి లో గోధుమ రంగు వరకు వేగనివాలి. అంతే ఎంతో రుచిగా ఉండే నేతి అరిసెలు తినడానికి రెడీ !
*****
జంతికలు
కావలసిన వస్తువులు :
బియ్యం-1 కేజీ
శెనగపప్పు- అర కేజీ
మినపప్పు -అర కేజీ
సగ్గుబియ్యం - పావుకేజీ
నూనె - సరిపడినంత
ఉప్పు,కారం-తగినంత
తయారు చేయు పద్ధతి :
ముందుగా బియ్యం పప్పులు కలిపి మర పట్టించాలి. పిండిలో ఉప్పు, కారం,కొంచెం తెల్ల నూపప్పు, నీళ్ళు కలిపి జంతికల పిండిలాగ కలిపి కొంచెం పిండి జంతికల గొట్టంలో వేసి కాగిన నూనెలో జంతికలు వేయాలి. బాగా వేగాక బయటకు తీసి,చల్లారాక ఒక డబ్బాలో పెట్టుకోవాలి.