రెడ్ రసబెర్రీ ఐస్‌క్రీం
కావలసిన పదార్థములు:
పాలు : 1/2 లీటరు
క్రీం : 1 కప్పు
రసబెర్రీ ఎసెన్సు : 1 చెంచా
పంచదార : 4 చెంచాలు
పాలు : 5 చెంచాలు
తయారుచేయు విధానం:
*పాలు గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టాలి. వాటిని కాగనిచ్చి పావు వంతు అయ్యే వరకు మరిగించాలి. మరిగినంత సేపు గరిటతో కలుపుతూ వుండాలి.
* పాలన్నీ ఇగిరిన తరువాత పంచదార వేసి వుంచాలి.
* అది కరిగిన తరువాత కండెన్స్‌డ్ మిల్క్ కలిపి అయిదు నిమిషాలు ఉంచి దించాలి.
* ఆ మిశ్రమం బాగా చల్లారిన తరువాత ఎసెన్సు, కలర్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని మిక్సీ వేసి అరనిమిషం పాటు ఆన్ చేయాలి.
* తరువాత కొంచెం కొంచెం క్రీం కలుపుతూ బాగా బీట్ చేస్తూ మిశ్రమం అంతా క్రీమ్ అయ్యేంత వరకు కలపాలి.
* తరువాత ఈ మిశ్రమాన్ని ఫ్రీజ్‌లో పెట్టి కొద్దిగా గట్టి పడుతున్నప్పుడు తీసి మళ్ళీ మిక్సీలొ వేసి తీయాలి.
* ఈ మిశ్రమాన్ని ఫ్రీజ్‌లో పెట్టి బాగా గట్టి పడిన తరువాత తీసి ఐస్‌క్రీం బౌల్స్‌లో పెట్టి పైన చెర్రీస్, క్రీం వేసి కూల్‌గా చెయ్యాలి.