రాజస్థానీ దిల్ జానీ

 

 

రాజస్తాన్ స్వీట్స్ ఎంత తిన్న ఇంకా తినాలనే అనిపిస్తుంది. మామూలుగా చేసే స్వీట్స్ కి వాళ్ళు  ఇచ్చే ఫినిషింగ్ టచ్ మరింత రుచిని తెచ్చేస్తుంది. అలాంటి ఒక రెసిపీ మీ కోసం.


కావాల్సిన పదార్థాలు:

సెనగ పిండి - 1/4 కేజీ

పంచదార - 1/4 కేజీ

పుచ్చకాయ గింజలు - 1 స్పూన్

గులాబీ రేకులు - 2 స్పూన్స్

నిమ్మరసం - 1 స్పూన్


తయారి విధానం:

ముందుగా సెనగపిండిని పల్చగా కలుపుకుని రెండు భాగాలుగా చేసి ఒక దానిలో ఎరుపు రంగు మరో దానిలో ఆకుపచ్చ రంగు వేసి కలిపి పెట్టుకోవాలి. రెండు పిండులని బూన్డిలా దోచుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పంచదార మునిగే దాకా నీళ్ళు పోసి తీగపాకం వచ్చేవరకు మరగనివ్వాలి. అది కాస్త ఆరాకా అందులో ముందుగా  వేయించిపెట్టుకున్న బూంది మిశ్రమాన్ని వేసి కలిపాలి. ఫైనల్ టచ్ గా అందులో నిమ్మరసం పిండాలి.  పుచ్చకాయ గింజలు, గులాబి రేకులు వేసి అలంకరించు కుంటే చాలు మంచి వెరైటి స్వీట్ మీ ముందుంటుంది. కావాలంటే లడ్డులా చుట్టుకోవచ్చు లేదా బూందిలా ఉంచుకోవచ్చు.

- కళ్యాణి