పౌండ్ కేక్ 

 


కావాల్సిన పదార్థాలు :

100గ్రాముల పిండి

100గ్రాముల క్యాస్టర్ షుగర్

100గ్రాముల వెన్న

2.4గ్రాముల బేకింగ్ పౌడర్

2గుడ్లు

వనీల

 

తయారు చేయు విధానం :

ఒక గిన్నెలో వెన్న, పంచదార తీసుకుని బాగా మిక్స్ చేయాలి. మెషిన్ సాయంతో క్రీమ్ లాగా మారేలా నాలుగైదు నిమిషాలు మిక్స్ చేయాలి. వెన్న, పంచదార మిశ్రమానికి ఒక మూత పరిమాణంతో వనీలా యాడ్ చేయాలి. మళ్లీ బాగా మిక్స్ చేయాలి. తరువాత గుడ్లని పగల గొట్టి ద్రవాన్ని ఒక బౌల్ లో వేసుకోవాలి. ఆ ద్రవాన్ని కూడా వెన్న, పంచదారల మిశ్రమానికి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మిక్సింగ్ కంటిన్యూ చేయాలి. మరో పాత్రలో పిండి, బేకింగ్ పౌడర్లు మిక్స్ చేసుకుని దాన్ని కూడా మొదటి మిశ్రమానికి కలుపుకోవాలి. ఇలా సిద్ధమైన పేస్ట్ ని మౌల్డ్ లో వేసుకుని కేక్ ఆకారాంలోకి మార్చాలి. తరువాత ఓవెన్ లో పెట్టి 180డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 15 నుంచీ 20నిమిషాల పాటూ వేడి చేయాలి. పౌండ్ కేక్ రెడీ!