పిస్తా-కొబ్బరి బర్ఫీ
కావలసిన పదార్థాలు:
పిస్తాపప్పు - రెండు కప్పులు
కొబ్బరి తురుము - పావుకప్పు
చక్కెర - ఒక కప్పు
యాలకుల పొడి - ఒక చెంచా
తయారీ విధానం:
పిస్తాపప్పుని నీటిలో నానబెట్టాలి. అరగంట తర్వాత నీటిని ఒంపేయాలి. ఆపైన పిస్తా, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి చక్కెర, పావుకప్పు నీళ్లు వేయాలి. పాకం పట్టేవరకూ సన్నని మంట మీద మరిగించాలి. పాకం తయారయ్యాక పిస్తా, కొబ్బరి మిశ్రమాన్ని వేయాలి. అడుగంటకుండా బాగా కలుపుతూ సన్నని మంటమీద ఉడికించాలి. బాగా దగ్గరగా అయ్యిన తరువాత యాలకుల పొడి చల్లి దించేయాలి. ఓ ప్లేట్ కి నెయ్యి రాసి మిశ్రమాన్ని వేయాలి. వేడిగా ఉన్నప్పుడే నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
- Sameera