పనీర్ తో ఖీర్ రెసిపి! 

  

కావలసిన పదార్ధాలు:

పనీర్ - 100 గ్రాములు

నెయ్యి - మూడు స్పూన్లు

బాదాం - 15 గ్రాములు

కిస్మిస్ - 10 గ్రాములు

పంచదార - ఒక కప్పు

యాలకుల పొడి - అరస్పూన్

కాజు - 15 గ్రాములు

పాలు  - అరలీటరు

తయారు చేసే విధానం:

ముందుగా పాలను మరిగించుకోవాలి. ఇందులో పనీర్ తురుము, వేసి ఉడికించుకోవాలి తరువాత పంచదార వేసి సిమ్ లో ఉడికించాలి. యాలకుల పొడి వేయాలి.

పక్కన పాన్ పెట్టి స్పూన్ నెయ్యి వేడిచేసి కాజు,కిస్మిస్ వేయించాలి. ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు మిశ్రం చిక్కబడిన తరువాత అందులో వేయించి వుంచుకున్నజీడిపప్పులను సన్నగా కట్ చేసిపెట్టుకున్న బాదాం లను వేసేసుకోవాలి.

మొత్తాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. దీనిని ఎలా అయిన సర్వ్ చేసుకోవచ్చు,చల్లగా కావాలన్నా , వేడిగా అయిన కూడా దీని రుచి చాల బావుంటుంది.