మూంగ్ దాల్ హల్వా
కావలసినవి :
పెసరపప్పు : 100 గ్రాములు
పాలు : పావు లీటర్
నెయ్యి : 100 గ్రాములు
యాలకులపొడి : అర టీ స్పూన్
బాదం పప్పులు : మూడు
జీడిపప్పులు : ఆరు
కిస్మిస్లు : ఆరు మిల్క్
కండెన్స్డ్ మిల్కు : కప్పు
తయారుచేయు విధానం :
ముందుగా పెసరపప్పుకడిగి రెండు గంటల ముందు నానపెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి .తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నెయ్యి వేసి కాగాక, గ్రైండ్ చేసిన పెసరపప్పుపేస్ట్ ను వేసి కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పాలు పోసి ఉడికించాలి. పాలు ఇగిరిపోయాక కండెన్స్డ్డుడు మిల్క్ వేసి కలుపుతూ వుండాలి. కొద్దిసేపటికి హల్వలా తయారవుతుంది. ఇప్పుడు యాలకులపొడి, జీడిపప్పులు, బాదాం పప్పులు, కిస్మిస్లు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ కూ నెయ్యి రాసి హల్వా వేసి చల్లారక కావలసిన సైజు లో ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకోవాలి..
