Mango Cheese Cake
హాయ్..
ఈ రోజు మీకు చెప్పబోతున్న రెసిపీ మాంగో చీజ్ కేక్... కేక్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది , సమ్మర్ సీజన్ కాబట్టి మాంగో కేక్ అంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు.. మరి ఎంతో డెలీషియస్ గా ఉండే మాంగో చీజ్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా...
కావాల్సిన పదార్ధాలు:-
మామిడి పండు
చీజ్
చక్కెర పొడి
క్రీం
బిస్కెట్ పౌడర్
పుదీనా
మాంగో పల్ప్
తయారు చేసే విధానం:
ముందుగా మనం కొన్ని బిస్కెట్స్ తీసుకోవాలి ( కారంగా, ఉప్పగా ఉన్న బిస్కెట్స్ తీసుకోకూడదు ) స్వీట్ బిస్కెట్స్ మాత్రమే తీసుకోవాలి. ముందుగా ఆ బిస్కెట్స్ ని మెత్తగా బ్లెండ్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి.
ఈ బిస్కెట్ పౌడర్ లో బటర్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన ఆ మిశ్రమాన్ని ఒక మౌల్డ్ లో వేస్కుని రెండు నిముషాలు గట్టిపడేవరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తరవాత ఒక బౌల్ లో మామిడిపండు గుజ్జుని తీసుకోవాలి.
ఇందులో ఒక కప్పు క్రీం చీజ్ కూడా వేసి బాగా కలుపుకోవాలి (ఒకవేళ క్రీం చీజ్ దొరకకపోతే పనీర్ వేస్కొవచ్చు ) ఇదే మిశ్రమంలో చక్కర ( తీపికి సరిపడా ) కలపాలి. ఇందులోనే విప్డ్ క్రీం వేస్కుని (ఇది మార్కెట్ లో దొరుకుతుంది whipped cream )బాగా బీట్ చేసుకోవాలి.
ఇపుడు మనం తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన బిస్కెట్ batter ని తీస్కుని, దానిపై లేయర్ లాగా ఈ (మాంగో పల్ప్, క్రీం చీజ్, విప్డ్ క్రీం) మిశ్రమాన్ని వేసేయాలి. చివరిగా మామిడిపండు ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
ఇంకా కొంచెం కలర్ ఫుల్ గ ఉండడానికి పైన పుదీనా ఆకులతో డెకరేట్ చేసుకోవాలి. ఇపుడు ఈ కేక్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ ఐన తరవాత పీసెస్ లాగా కట్ చేస్కుని తింటే చాల బాగుంటుంది. ఇంతే, ఎంతో చక్కగా ఈజీ గ చేసుకోగలిగే మాంగో చీజ్ కేక్ రెడీ మీరూ ట్రై చేయండి మరి.
https://www.youtube.com/watch?v=lplPLcsQa6E