కొబ్బరితో  పాయసం రెసిపి

 

 

కావలసిన పదార్ధాలు:

పచ్చికొబ్బరి - 2 కప్పులు

పాలు - 1 లీటర్

కోవా - 200 గ్రాములు

కుంకుమ పువ్వు - చిటికెడు

చక్కర - 200 గ్రాములు

జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా - 1/4 కప్పు

యాలకుల పొడి - 1 టీ స్పూన్

 

తయారీ విధానం :

ముందుగా కొబ్బరి తురిమి ఉంచుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు, కొబ్బరి కలిపి రెండు చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. ఆ తర్వాత కోవా,చక్కర వేసి ఉడికించాలి.

యాలకుల పొడి వేసి కలిపి దింపేయాలి. సన్నగా కట్ జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా వేసి డెకరేట్ చేయాలి.

పైన కుంకుమ పువ్వు కూడా వేస్తె ఇంకా అందంగా వుంటుంది.

కొంచం సేపు ఫ్రిడ్జ్ లోపెట్టి తర్వాత సర్వ్ చేయండి..........