కేసరి ఖీర్ రెసిపి

 

 

కావలసిన వస్తువులు:

పాలు - 1 లీటరు.

నెయ్యి - 2 స్పూన్లు.

పంచదార - 150 గ్రాములు.

బియ్యపు పిండి - 70 గ్రాములు.

పిస్తా - 1 స్పూను.

కేసరి - 1 స్పూను.

పాల మీగడ - 1/2 కప్పు.

బాదం పప్పులు - 50 గ్రాములు.

వేడి పాలు - 1/2 స్పూను.

 

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గంటసేపు బాదం పప్పులు నీటిలో నానబెట్టాలి.

కేసరి గుళికలు తీసుకొని  వేడి పాలల్లో నానబెట్టాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి బాండీలో నెయ్యి వేసి కాగాక, బియ్యపు పిండి వేసి  ఎర్రగా వేయించుకోవాలి.

తరువాత పాలు పోసిఉండలు లేకుండ కలుపుతూ ఉండాలి.

అందులో పంచదార పోసి గట్టి పాకం వచ్చేంత వరకు ఉంచాలి.

ఒక ప్లేట్ కీ  నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని  పోసి చాల్లార్చి పైన మీగడ బాదం పప్పు, పిస్తా పప్పు తో అలకరించుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

ఈ స్వీట్ ని బాగా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బావుటుంది.