రక్షాబంధన్ స్పెషల్ - కాజు పిస్తా రోల్
కావాల్సిన పదార్థాలు:
జీడిపప్పు -1/2 కేజీ
పిస్తా-1/2 కేజీ
చక్కెర -400గ్రాములు
ట్రాక్-1/2 కేజీ
సిల్వర్ వారక్ కుంకుమ పువ్వు
తయారీ విధానం:
- 1/2 కిలోల జీడిపప్పును నీటిలో నానబెట్టండి. తర్వాత వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో 250 గ్రాముల చక్కెర కలపండి. ఈ పేస్ట్‌ను పాన్‌లో 45 నిమిషాలు నెమ్మదిగా మంట మీద దగ్గరకు వచ్చేలా కలపండి.
- 1/2 కిలోల పిస్తా తీసుకుని.. అందులో 250 గ్రాముల పంచదార వేసి పేస్ట్ చేయాలి. అరగంట పాటు తక్కువ మంట మీద ఉంచండి.
- ఇప్పడు జీడిపప్పు మిశ్రమని పలుచగా రోల్ చేసుకోవాలి. అందులో పిస్తా ఫిల్లింగ్ వేయాలి. ఒకసారి రోల్ చేసి పిస్తా రోల్ లాగా ఉండేలా కట్ చేయాలి.
- ఇప్పుడు పిస్తా రోల్స్‌ను వెండి వారక్, కుంకుమపువ్వుతో అలంకరించండి. చాలా సింపుల్ గా ఉంది కదూ..మీరూ ట్రై చేయండి.