గులాబ్ జామూన్

చాలా మంది గులాబ్ జామ్ సరిగ్గా కుదరడం లేదు, ముక్కలై పోతున్నాయి అని అనుకుంటూ ఉంటారు.. అయితే అలాంటి వారికోసమే ఈ రెసెపి..చిన్న చిన్న టిప్స్ తో పర్ఫెక్ట్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధములు:

గులాబ్ జామూన్ ప్యాకెట్ - 1(200g)

పంచదార - 1/2కేజీ

యాలకుల పొడి - అర టీస్పూన్

నూనె - 500g

పాలు - 100g

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె లోకి జామూన్ పౌడర్ తీసుకుని అందులో కాచిన పాలు కొద్దీ కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని చపాతీ ముద్ద లాగా మెత్తగా కలిపాక దాని మీద మూతపెట్టి ఒక 15మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిమీద మరొక గిన్నె పెట్టి మనం తీసుకున్న పంచదారని అందులో పోసి రెండు గ్లాస్ ల నీళ్లు పోసుకోని పాకం వచ్చే వరకు మరగనివ్వాలి.. అప్పుడు అందులో రెడీగా పెట్టుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. పాకం రెడీ అయ్యాక దానిని పక్కన పెట్టుకుని పిండిని తీసుకుని చేతికి కొద్దీ కొద్దిగా నెయ్యి రాసుకుంటూ పిండిని గట్టిగా వత్తుతూ ఉండలు చేయాలి. అలా గట్టిగా వత్తుతూ చేయడం వల్ల ఉండకి పగుళ్ళు రాకుండా స్మూత్ గా వస్తాయి.. అలా మొత్తం ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగేవరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి.. నూనె కాగాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉండలు వేయించాలి. అవి బాగా గోల్డ్ కలర్ లోకి వచ్చేవరకు వేయించాలి.. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయించిన ఉండలు వేసుకుని, ఉండలు పాకం లో నానె వరకు పక్కన పెట్టుకుని... ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి..

టిప్స్:

1.గోరువెచ్చగా ఉన్న పాలతో పిండిని కలుపుకోవాలి.

2. పిండిని గట్టిగ కలపకూడదు. సున్నితంగా కలుపుకోవాలి.

3.ఉండలు వేయించినంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి..

4.ఉండలు పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండాలి..